వాజేడు , జూన్ 24 : మండలంలోని పలు గ్రామల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్న హ ర్షం వ్యక్తం చేస్తూ.. సాగు పనుల్లో బిజీ అయ్యారు. మం డలంలోని ప్రగళ్లపల్లి, కొప్పుసూరు, వాజేడు, జగన్నాథపురం, పేరూరు, చండ్రుపట్ల, చెరుకురు, ధర్మవరం తదితర గ్రామాల్లో ట్రాక్టర్ల సాయంతో అన్నదాతలు పొలాల్లో దుక్కు లు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు.
అందుబాటులో వరి విత్తనాలు..
మండలకేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం(సొసైటీ) కార్యాలయంలో 1001, బీపీటీ వరి విత్తన బస్తాలు అందుబాటులో ఉన్నట్లు సంఘ సీఈవో సోమ సత్యనారాయణ తెలిపారు. రైతులు పట్టాదారు పాస్పుస్తంకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు అందజేసి, నగదు చెల్లిం చి, విత్తనాలు తీసుకెళ్లాలని సూచించారు.
ఏరువాక పున్నమితో వ్యవసాయ పనులు ప్రారంభం..
కన్నాయిగూడెం: అన్నదాతకు మొదటి పండుగగా చెప్పుకునే ఏరువాక పున్నమి రోజుతోనే అందరూ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య తెలిపారు. గురువారం సొంత గ్రామమైన గూర్రేవులలో బుచ్చయ్య దంపతులు తమ పొలం వద్దకు వెళ్లి భూతల్లికి ప్రత్యేక పూజలు చేసి, పనులు ప్రారం భించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి సత్యనారాయణ, తడకల మధుకర్, పల్లా వెంకటేశ్వర్లు, పూజారి నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.