సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు టీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం
ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు సర్కారు జీవో జారీపై హర్షం
ముఖ్యమంత్రికి పలు సంఘాల కృతజ్ఞతలు
పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 12 :తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారింగా నిర్వహించేందుకు జీవో జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాలకుర్తి సహా పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు వీరవనిత చిట్యాల ఐలమ్మ విగ్రహానికి, సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వరాష్ట్రంలోనే పోరాటయోధులకు గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పాలకుర్తి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. పాలకుర్తిలో ఐలమ్మ కాంస్య విగ్రహానికి, సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పాలకుర్తి ప్రాంతానికి చెందిన వీరనారి చాకలి ఐలమ్మను సీఎం కేసీఆర్, ప్రభుత్వం గుర్తించడం అభినందనీయమన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక కృషితోనే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లికి రుణపడి ఉంటారని వివరించారు. ఎఫ్ఎస్సీఎస్ బ్యాంకు చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, మార్కెట్ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఎండీ సర్వర్‌ఖాన్, కటారి పాపారావు, మాచర్ల ఎల్లయ్య, గజ్జి సంతోష్, జోగు గోపి, కమ్మగాని రమేశ్, కాటబత్తిని రమేశ్, నోముల సతీశ్, కొత్త ఇంద్రారెడ్డి పాల్గొన్నారు