వెల్దండ, ఆగాపేట గ్రామాల్లో పార్టీ కమిటీల ఎన్నిక
నర్మెట, సెప్టెంబర్ 6: కార్యకర్తల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. సోమవారం వెల్దండ, ఆగాపేట కమిటీలను ఎన్నికల పరిశీలకులు ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నీరేటి సుధాకర్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెల్దండ గ్రామ అధ్యక్షుడిగా బైరగోని రవీందర్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా కొన్నె మనోహర్, కల్వకుంట్ల మల్లేశం, కార్యదర్శిగా పాకనాటి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా రుషి కర్ణాకర్‌రెడ్డి, బైరగోని శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారిగా కొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడిగా నీల వెంకటేశ్, ఉపాధ్యక్షుడిగా బైరగోని శ్రీనివాస్, కార్యదర్శిగా కుంచం మల్లేశం, సంయుక్త కార్యదర్శులుగా గూటం పరమేశ్, చెవుల నవీన్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా పుట్ట భిక్షపతి, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా శాడ ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా గోల్కొండ అంజయ్య, దామెర నర్సింహ్మ, వెంకటేశ్, గూటం మనోహర్, కల్యాణం రాములు, తమ్మడి సోమయ్య, శ్రీపతి రాజు, భాస్కర్, కర్ణాకర్ హారీశ్, కంతి దేవాదానం ఎన్నికయ్యారు. ఆగాపేట గ్రామ అధ్యక్షుడిగా మేడబోయిన రాజు, యూత్ అధ్యక్షుడిగా కోనేటి అనిల్, సోషల్ మీడియా అధ్యక్షుడిగా మార్క గణేశ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు చేర్యాల సత్యనారాయణ, మండల అధికార ప్రతినిధి వంగ రవి, నాయకులు కాదునూరి అమర్నాథ్, పుట్ట నర్సింహులు, పిట్టల నరేశ్, భూపాల్‌రెడ్డి, మల్లేశం, సోమయ్య, సిద్ధయ్య, రవికుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లిలో సోమవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పండుగ వాతావరణం సంతరించకున్నది. పార్టీ గ్రామ అధ్యక్షుడు నీల ఆగయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో క్లస్టర్ ఇన్చార్జిలు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య, యువజన జిల్లా నాయకుడు కుర్ర కమలాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నూనెముంతల భిక్షపతి, సర్పంచ్ తూకుంట్ల సురేందర్, ఎంపీటీసీ సుల్తాన్ దేవేందర్‌రెడ్డి, ముఖ్యకార్యకర్తలతో మాట్లాడారు. అభిప్రాయం సేకరించి నివేదికను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అందిస్తామని, త్వరలో గ్రామ అధ్యక్షుడిని ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు.
స్టేషన్ ఘన్పూర్: మండలంలోని విశ్వనాథపురం, తానేధార్‌పల్లి, రాఘవాపూర్, తాటికొండ, మీదికొండ గ్రామాల్లో క్లస్టర్ ఇన్చార్జులు గ్రామ కమిటీలు వేసి వారి పేర్లను ఎమ్మెల్యే రాజయ్యకు అందించారు. మండల కన్వీనర్ మాచర్ల గణేశ్, తానేధార్‌పల్లి గ్రామ అధ్యక్షుడు చల్లా చందర్‌రెడ్డి, మాచర్ల రఘురాములు, పద్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జనార్దన్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, ప్రవీణ్, పురుషోత్తం, క్లస్టర్ కమిటీ సభ్యులు తోట సత్యం , ఎంపీటీసీ గుర్రం రాజు, ఏసుబాబు, బైరి నాగరాజు విశ్వనాథపురంలో ఉపసర్పంచ్ దాసి నర్సయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, కంజర్ల యాదగిరి, శివరాత్రి ఎల్లయ్య, పోలే మల్లయ్య, బత్తిని ఉప్పలయ్య, సంపత్ పాల్గొన్నారు.
అభివృద్ధిలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర..
గ్రామాల అభివృద్ధిలో గ్రామ కమిటీలదే కీలకపాత్ర అని జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు మండలంలోని తాటికొండ, రాఘవాపూర్, గ్రామాల్లో క్లస్టర్ ఇన్చార్జులు మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ మాచర్ల గణేశ్ గ్రామ కమిటీలు వేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా దళితుల అభివృద్ధికోసం దళిత బంధు పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని దళితవాడల్లో సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర చేసి సమస్యలు తెలుసుకుని వాని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాని తెలిపారు. ఈ కమిటీలు రెండు రోజుల్లో పూర్తవుతాయని, ప్రతి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాటికొండ సర్పంచ్ చల్లా ఉమాసుధీర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మారపాక రాములు, రాఘవాపూర్‌లో సర్పంచ్ కందుల శ్రీలత, ఉపసర్పంచ్ కాసాని మల్లయ్య, కందుల గట్టయ్య, పిట్టల రాజేందర్, పనికర కుమార్, సింగపురం మోహన్, వార్డు సభ్యలు కుక్కల రాజు, రామస్వామి, రాంబాబు పాల్గొన్నారు.
దేవరుప్పుల: మండల కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామ ఇన్చార్జి, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మండల నాయకులు హాజరయ్యారు. కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు గ్రామ, యూత్, రైతు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా లొడంగా వెంకన్న, ఉపాధ్యక్షులుగా కొంపెల్లి లాలు, నడిదె రాజు, ప్రధాన కార్యదర్శిగా జోగు ఐలమల్లు ఎన్నికయ్యారు. యూత్ కమిటీ అధ్యక్షుడిగా అంబాల యాకన్న, ఉపాధ్యక్షుడిగా తోటకూరి సంతోశ్, ప్రధాన కార్యదర్శిగా చింత సోమేశ్, సంయుక్త కార్యదర్శిగా కారుపోతుల వేంకటేశ్, కోశాధికారిగా జోగు కిరణ్, సోషల్ మీడియా ఇన్చార్జులుగా అన్నెపు యాకయ్య, జోగు ప్రవీణ్, నీలారపు శ్రీకాంత్, మన్నూరి ప్రశాంత్, చింత శ్రీనివా స్ ఎన్నికయ్యారు. రైతు కమిటీ అధ్యక్షుడిగా రెడ్డిరాజుల కొండ య్య, ఉపాధ్యక్షుడిగా బోయిని కొండయ్య, కార్యదర్శిగా లింగా ల సత్తయ్య ఎన్నికయ్యారు. సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఈదునూరి నర్సింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్ కారుపోతుల భిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జోగు సోమనర్సయ్య, పాలకుర్తి దేవస్థాన కమిటీ సభ్యుడు తీగల సత్తయ్య, ఉపసర్పంచ్ తోటకూరి దశరథం, మండల నాయకులు తోటకూరి కిష్టయ్య, బొందుగుల సోమయ్య, యాకయ్య, తోటకూరి రాంచంద్రయ్య, అబ్బ సాయిలు, యాకయ్య పాల్గొన్నారు.