‘సంచార వైద్య’ సేవలతో సత్ఫలితాలు
‘1962’కు ఒక్క ఫోన్ కాల్‌తో అత్యవసర వైద్యం
జీవాలు ఉన్న చోటుకే వాహనాలు.. మెడికల్ కిట్ల పంపిణీ
జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో అంబులెన్సులు
జిల్లాలో ఇప్పటికే 20 వేల జీవాలకు చికిత్స
జనగామ రూరల్, అక్టోబర్ 4 : మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. టోల్‌ఫ్రీ నంబర్ 1962కు ఒక్క ఫోన్ చేస్తే చాలు రైతులు కోరినచోటుకు అంబులెన్సు వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నది. సమైక్య పాలనలో పశువులు, గొర్రెలు, మేకలకు సీజనల్ వ్యాధులు ప్రబలితే వైద్యం కోసం దూర ప్రాంతాల్లోని పశు వైద్యశాలకు వెళ్లాల్సి వచ్చేది. రైతుల సమస్యలు గమనించిన సీఎం కేసీఆర్ 2017 సెప్టెంబర్ 15న సంచార వైద్యవాహనాలను ప్రారంభించారు. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఫలితంగా సకాలంలో వైద్యం అందుతున్నది. దీంతో పశువులు, జీవాల మరణాలు గణనీయంగా తగ్గాయి.
పశువులు, జీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నరీతిలో అందింస్తున్న సంచార పశువైద్యం రైతులకు వరంగా మారింది. ప్రజలకు సాధారణ వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు ఏర్పాటు చేసినట్లుగానే మూగజీవాల కోసం ప్రత్యేక వాహనాల ద్వారా చికిత్స అందిస్తున్నది. 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే క్షణాల్లో పశువైద్యులు వచ్చి వైద్యం చేస్తున్నారు. సమైక్య పాలనలో పశువులు, గొర్రెలు మేకలకు సీజనల్ వ్యాధులు వస్తే సత్వరమే వైద్యం అందేది కాదు. దీంతో పెంపకందారులు నానా ఇబ్బందులకు గురయ్యేవారు. పక్క మండ లాల్లోని పశువుల దవాఖానకు జీవాలను తీసుకెళ్లాల్సి వచ్చేది. పెంపకందారుల ఇబ్బం దులు గుర్తించిన సీఎం కేసీఆర్ 2017 సెప్టెంబర్ 15న సంచార వైద్యవాహనాలను ప్రారం భించారు. ఫలితంగా పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రాల్లో సంచార వాహనాలు(అంబులెన్స్‌లు) ఏర్పాటు చేశారు. ఒక్కో వాహనంలో పశువైద్యుడు, ఇద్దరు సహాయ కులు, ఓ పైలెట్ ఉంటారు. ఇప్పటి వరకు జిల్లాలో 26,378 మూగజీవాలకు చికిత్స అందిం చారు.
మూగజీవాలకు మెరుగైన వైద్యం
నోరు లేని మూగ జీవాలకు వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార పశువైద్యశాలలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేవలం ఒక్క ఫోన్ కాల్‌తో సంచార పశువైద్య వాహనం అరగంటలో పశువుల మంద, లేదా గొర్రెల మంద వద్దకొస్తుంది. చికిత్సతోపాటు ఉచితంగా మందులు ఇస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయి.
తగ్గిన పశువుల మరణాలు
సంచార పశువైద్యంతో గ్రామాల్లో మంచి ఫలితాలొస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు సంచార పశువైద్యంతో పశువుల మరణాలు గణనీయంగా తగ్గాయి. రైతులు ఫోన్ చేసిన కొద్ది సమయంలోనే అంబులెన్సు చేరుకుని వైద్యం అందిస్తుండడంతో గ్రామాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్ప టి వరకు సుమారు 20 వేల పశువులకు వైద్యం అందించారు. మరోవైపు కుక్క లతోపాటు వన్యప్రాణులైన నెమళ్లు, కోతు లు, కుందేళ్లు, కోళ్లకు సైతం వైద్య సేవలందిస్తున్నారు.