స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 4 : ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీడీవో కుమారస్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధీర్ సూచించారు. సోమ వారం మండలంలోని తాటికొండ గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్ కావడంతో వైద్య సిబ్బంది కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని పీహెచ్‌సీల పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. తెలంగాణలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఈనెల 16 నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో మాత్ర మే కరోనా నివారణ వ్యాక్సిన్ వేసే వారిమని, కానీ నేడు మారుమూల గ్రామాల్లో కూడా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ విజయ్ కిరణ్, సీహెచ్‌వో కిషన్ రావు, స్టాఫ్ నర్సు సితార, ఏఎన్ఎంలు అరుణ, ఎలిషా, ఆశ కార్యకర్తలు మాధవి, జ్యోతి, సబీనా, రజిత, రాణి, అంగన్వాడీ టీచ ర్లు ఎన్ పద్మ, ధనలక్ష్మి, సులోచన, శ్రీదేవి, లలిత పాల్గొన్నారు.