యూపీలో రైతులపై దాడిని ఖండించిన పలు పార్టీల నాయకులు
అన్నదాతలను హత్య చేశారంటూ ఆగ్రహం
కేంద్రమంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్
నర్సంపేట, అక్టోబర్ 4: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రాను బర్తరఫ్ చేయాలని నర్సంపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని లాఖిమ్పూర్ భేరిలో అజయ్‌మిశ్రా కాన్వాయ్ దాడిలో ఎనిమిది మంది రైతులు చనిపోయారన్నారు. రైతు ఉద్యమంపై తుపాకీ గుండ్ల వర్షం కురిపించి వాహనంతో తొక్కించి రైతుల హత్యకు కారణమైన అజయ్‌మిశ్రాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మండల ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, కొల్లూరి లక్ష్మీనారాయణ, రామ్‌ప్రసాద్, కుమారస్వామి, చంద్రమౌళి, నర్సయ్య, వంశీ, కృష్ణ, మోహన్‌రెడ్డి, హరీశ్, క్రాంతి, రాజేందర్, రవి పాల్గొన్నారు.
రైతులను హత్య చేయడం హేయం
ఎనిమిది మంది రైతులను హత్య చేయడం హేయమని ఐఎఫ్టీయూ, ఏఎంఎస్, ఎంసీపీఐయూ నాయకులు వేర్వేరుగా అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి దిష్టిబొమ్మను నర్సంపేటలోని అంబేద్కర్ కూడలిలో దహనం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, రాజేందర్, నరేశ్, వీరారెడ్డి, పెద్దారపు రమేశ్, వెంకన్న, కుమారస్వామి, బాబురావు, కొమురయ్య పాల్గొన్నారు.
మోదీ దిష్టిబొమ్మ దహనం
నెక్కొండ: మండలకేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల ఆధ్వర్యంలో నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోం సహాయ మంత్రి కాన్వాయ్ దాడిలో ఎనిమిది మంది రైతులు చనిపోవడం మోదీ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు తాటిపెల్లి శివకుమార్, ఉప సర్పంచ్ దేవనబోయిన వీరభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, యూత్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపెల్లి రాజు, యూత్ మండల అధ్యక్షుడు విజేందర్, మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అమీర్, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్ పాషా, ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, చంద్రుగొండ ఉప సర్పంచ్ ఎర్ర సతీశ్, వార్డు సభ్యుడు తోట సాంబయ్య పాల్గొన్నారు.
ప్రధాని మోదీ రాజీనామా చేయాలి
ఖానాపురం: ఉత్తరప్రదేశ్‌లో రైతుల చావుకు కారణమైన ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగీ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాదరావు, హరిబాబు, మురళి, ప్రసాదరావు, శ్రీను, నవీన్, రమేశ్, వెంకటేశ్, ముఖేశ్ పాల్గొన్నారు.
కేంద్రమే బాధ్యత వహించాలి
గీసుగొండ: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉత్తరప్రదశ్ రాష్ట్రంలో నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడు దాడులు చేయడం వెనుక మోదీ సర్కార్ హస్తం ఉందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కనకం సంధ్య, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పోగుల ఆగయ్య నగర్లో నిరసన తెలిపారు. రైతుల చావులకు కారణమైన మంత్రి కొడుకును వెంటనే ఆరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రేణుక, స్వప్న, రాజు, శివకుమార్, కొమురమ్మ, మహేందర్, రమేశ్, వెంకన్న, మల్లికార్జున్, సురేశ్ పాల్గొన్నారు.