ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరెల పంపిణీ
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్, అక్టోబర్ 3 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు చీరెలు అందజేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని వివరించారు. దీనిని ఓర్వలేని విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పద్మావతి ఫంక్షన్హాల్లో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, నమిలిగొండ గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. జఫర్‌గఢ్ మండలం కూనూరులోనూ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్ చీరెలు పంపిణీ చేస్తున్నారని వివరించారు. సమైక్య పాలనలో బతుకమ్మ పండుగకు గుర్తింపు లభించలేదని, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి ,షాదీమూభారక్ పథకాలకు రూ.లక్షా 116 అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ పథకాలను అన్ని రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు,రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారని రాజయ్య తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వప్రసాద్, ఎంపీడీవో కుమారస్వామి, జడ్పీటీసీ మారపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, మండల ప్రత్యేకాధికారి డాక్టర్ నర్సయ్య, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేశ్, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, గుర్రం రాజు, సర్పంచ్‌లు స్వాతిరెడ్డి, చిగురు సరిత, చల్లా చందర్ రెడ్డి, రాఘవరెడ్డి, గుర్రం నరసింహులు, ఆర్ఐ కృపాకర్ రెడ్డి, చింత భరత్, చింత శ్రీను, సిరిగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. జఫర్‌గఢ్ మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పీటీసీ ఇల్లందుల బేబీ, వైస్ ఎంపీపీ కొడారి కనకయ్య, మం డల స్పెషల్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి, డిప్యూటీ త హసీల్దార్ నవీన్, ఆర్ఐ రాంబాబు పాల్గొన్నారు.
తప్పుగా అర్థం చేసుకుంటే మన్నించండి : రాజయ్య
బతుకమ్మ చీరెల పంపిణీలో భాగంగా శనివారం జరిగిన కార్యక్రమంలో తాను తప్పుగా మాట్లాడినట్లు మీడియాలో వచ్చిన కథనాలకు చింతిస్తున్నానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. తన భావాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుని మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్లు భావిస్తే తనను క్షమించాలని వేడుకున్నారు. మహిళల పట్ల తనకు అపార గౌరవం ఉందని, నేను తెలంగాణ యాసలో సీఎం కేసీఆర్ అన్నీ తానై అన్నివర్గాలకు పెద్ద కొడుకులా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనే అర్థంలో మాట్లాడానన్నారు. ఈ విషయంలో ఏ ఒక్కరి మనసు బాధపడినా నన్ను క్షమించాలని, దీన్ని ఇంతటితో వదిలేయండని రాజయ్య కోరారు.