రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామలో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు
హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జనగామ, అక్టోబర్ 02 (నమస్తే తెలంగాణ) : జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం అన్ని తరాలు ఆదర్శంగా తీసుకొని అనుసరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో గాంధీచౌక్‌లో మహాత్ముడి 152వ జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించి స్వచ్ఛ మిషన్ రథాన్ని ఎర్రబెల్లి ప్రారంభించారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ శాంతి, అహింస, సత్యం, ధర్మం పాటించాలని గాంధీ చెప్పిన మాటలను అందరూ ఆచరించి అనుసరించాలని సూచించారు. గాంధీజీ కలలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనం పెంపొందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అన్నారు. అహింస మార్గాన ఏదైనా చేయగలం అని నిరూపించిన మహావ్యక్తిగా చరిత్రకెక్కి ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలిచారన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని గాంధీజీ కోరుకునేవారని, ఆయన కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తున్న నేటి తెలంగాణ గాంధీ కేసీఆర్ అని ఆయన కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా నిధులు అందిస్తూ రాష్ట్రంలో 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామ, పట్టణ వార్డుల రూపురేఖలు మారిపోయాయన్నారు. హరితహారంతో గ్రామాల్లో ప్రచ్చదనం పరుచుకుందని, ప్రతి గ్రామంలో శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మంకీఫుడ్ కోర్టులు, బృహత్ ప్రకృతి వనాలు, రైతు కల్లాలు, రైతు వేదికలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడానికి, సీజనల్ వ్యాధులను అదుపు చేయడంలో ప్రభుత్వం ముం దున్నదన్నారు. అన్నదాతల కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేయడంతో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యు త్ ఇస్తున్నామని మంత్రి దయాకర్రా వు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏ.భాస్కర్‌రావు, అ బ్దుల్ హమీద్, జనగామ మార్కెట్ క మిటీ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.