సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు గుర్తింపు
కరోనాలోనూ సంక్షేమ పథకాల అమలు
మహిళల అభ్యున్నతికి సర్కారు కృషి
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్లలో బతుకమ్మ చీరెల పంపిణీ
ఘన స్వాగతం పలికిన మహిళలు
పాలకుర్తి రూరల్/దేవరుప్పుల/కొడకండ్ల, అక్టోబర్ 2 : తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ కోసం ఎప్పటిలాగే జిల్లావ్యాప్తంగా చీరెల పంపిణీ చేపట్టారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి శనివారం మహిళలకు చీరెలను అందజేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్ల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, అన్ని వర్గాల సంక్షేమమేధ్యేయంగా పాలన అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అందించిన చీరె పుట్టింటి సారెగా మహిళలు భావించాలన్నారు. సమై క్య పాలనలో బతుకమ్మ పండుగకు గుర్తింపు లభించలేదని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. క్రిస్మస్, రంజాన్ పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.46.96 కోట్లతో రూ.13,45,015 చీరెలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జనగామ జిల్లాలో రూ.8.48 కోట్లతో 97,573 చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని ఎర్రబెల్లి తెలిపారు. ఆడ బిడ్డలకు పెద్దన్న కేసీఆర్ అన్నారు. మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రజల దయ, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మం త్రి నయ్యానన్నారు. బతుకమ్మను కరోనా నిబంధనలు పాటి స్తూ సంబురంగా జరుపుకోవాలని సూచించారు.
రైతుల సంక్షేమానికి సర్కారు కృషి..
రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తూ వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా విపక్షాలకు ఇవి కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్ధుల్ హమీద్, డీపీవో రంగాచారి, జడ్పీ సీఈవో ఎల్ విజయలక్ష్మి, డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి, చేనేత జౌళీ శాఖ ఏడీ కల్యాణి, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో కృష్ణవేణి, ఏపీడీ ఎండీ నూరొద్దీన్, తహసీల్ద్థార్ ఎన్ విజయభాస్కర్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో ఆశోక్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, సర్పంచ్ వీరమనేని యా కాంతారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, వైద్యాధికారి టీ ప్రియాంక, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పీఏసీఎస్ చైర్మన్ గొనె మైసిరెడ్డి, మాజీ మా ర్కెట్ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, మేడారపు సుధాకర్, పోగు శ్రీనివాస్, చారగొండ్ల ప్రసాద్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దేవరుప్పులలో నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లా భార్గవి, ఎంపీపీ బస్వ సావిత్రి, దేవరుప్పుల, కామారెడ్డిగూడెం సర్పంచ్‌లు ఈదునూరి రమాదేవి, బిళ్ల అంజమ్మ, ఎంపీటీసీ తోటకూరి రేణుక, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమామహేశ్వర్, చందన మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ స్వప్న, కున్సోత్ సావిత్రి, కారుపోతుల సంధ్య పాల్గొన్నారు. కొడకండ్లలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ పేరం రాము, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీపీ జ్యోతిరవీంద్రాగాంధీనాయక్, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందె రామోజీ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో డాక్టర్ రమేశ్, సొసైటీ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, కో ఆప్షన్ సభ్యుడు నజీర్ పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లికి ఘన స్వాగతం..
బతుకమ్మ చీరెల పంపిణీకి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు దేవరుప్పుల, పాలకుర్తి, కొండకండ్లలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో వచ్చి ఆడిపాడారు. కోలాటాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. దేవరుప్పులలో తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి భారీ ర్యాలీతో అక్షర గార్డెన్‌కు చేరుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ శివలింగయ్యతో పాటు మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు.