ఖిలావరంగల్, మార్చి 26: ఖిలావరంగల్ తూర్పుకోటలో కాకతీయ రుద్రమాంబ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా కార్పొరేటర్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వృద్ధులకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు, వృద్ధులకు చీరెలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ప్రతియేడు సొసైటీ ఆధ్వర్యంలో పేద మహిళల అవసరాలను తీర్చుతూ సమాజ సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ రుద్రమాంబ సొసైటీ అధ్యక్షరాలు బైరబోయిన సరోజన యాదవ్, బస్వరాజు లక్ష్మి, తోట చంద్రకళ, మామునూరు అరుణ, ధనలక్ష్మి, హేమలత, వెంకటలక్ష్మి, బస్వరాజు జ్యోతి, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.