హనుమకొండ, జూన్ 26 : మహిళలతోనే మార్పు సాధ్యమని జిల్లా సంక్షేమ అధికారి కే మధురిమ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధురిమ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమని, పిల్లలకు నైతిక విలువలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నారు. స్నేహితులు, సోష ల్ మీడియా ప్రభావంతో యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను నాశ నం చేసుకుంటోందన్నారు.
కుటుంబ వ్యవస్థలో నైతికత దిగజారకుండా చూ సుకున్నప్పుడే ఎలాంటి సమస్యలు రావన్నారు. డీఎంహెచ్‌వో సాంబశివరావు మాట్లాడుతూ యువత గంజాయి, కొకై న్, హెరాయిన్ లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మల్టిపుల్ సైకాలజికల్ డిజార్డర్స్‌గా మారుతున్నారన్నారు. యు వత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, సన్మార్గంలో నడిచి దేశానికి ఆ యువుపట్టులా నిలవాలని కోరారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ మాట్లాడుతూ సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించిందన్నా రు.
ముఖ్యంగా మధ్యతరగతి వారు పిల్ల ల విషయంలో దృష్టి సారించకపోవడంతో ఈ అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇన్స్పెక్టర్ సుజాత మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం విషయం లో టార్గెట్ గ్రూపు, టార్గెట్ ఏరియాలపై దృష్టి సారించి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నా రు. సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు ప్రధాన కారణం పొగాకు అని అన్నారు. ముందు గా ఉదయం అదాలత్ సరిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అవగాహన కల్పించారు.
సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, కార్పొరేటర్ వసంత, హనుమకొండ, కాజీపేట ఏసీపీలు కిరణ్ కుమార్, శ్రీనివాస్, వైద్యాధికారులు మదన్మోహన్రావు, యాకూబ్ పాషా, డెమో వీ అశోక్ రెడ్డి, సీడీపీవో భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వరర్లు, మెప్మా ఆర్పీలు ర్యాలీలో పాల్గొని మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ప్లకార్డులతో అవగాహన కల్పించారు. సమావేశంలో డీఈవో అబ్దుల్ హై, డీసీపీవో సంతోష్ కుమార్, ఎఫ్ఆర్వో రవి కృష్ణ, సీనియర్ సహాయకులు వీ వెంకట్రామ్, హెల్పింగ్ హ్యాండ్ డైరెక్టర్ రాము పాల్గొన్నారు.