నయీంనగర్, జూన్ 10 : చెరువు ఒడ్డుకు ఓ వ్యక్తి నీటిలో తేలియాడుతుండడాన్ని స్థానికులు గమనించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అలాగే పడి ఉండడంతో చనిపోయాడనుకున్నా రు. వెంటనే 100, 108కి డయల్ చేశారు. సమాచా రం అందగానే పోలీసులు, 108 సిబ్బంది అంబులెన్స్‌తో అక్కడికి చేరుకున్నారు. మరి ఆ వ్యక్తి చనిపోయాడా? ఒకవేళ ప్రాణాలతో ఉంటే బతికిద్దామనుకున్నారు. ఈ క్రమంలో అతడి చేయి పట్టుకొని నీటిలోంచి బయటకు తీస్తుండగా హఠాత్తుగా లేచి అరవడంతో అం తా అవాక్కయ్యారు. ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. ‘ఇకడ చల్లగా ఉందని నేను రెస్ట్ తీసుకుంటున్నా.. నేను చావలేదు.. బతికే ఉన్నా’ అంటూ తాపీగా సమాధానమివ్వడంతో ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన సోమవారం కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధి రెడ్డిపురంలోని కోవెలకుంటలో జరిగింది. ఆరా తీస్తే అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్(46) అని, కాజీపేట దగ్గరలోని ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేస్తానని చెప్పా డు. ఉదయం 7నుంచి రాత్రి 7వరకు పనిచేస్తానని ఇప్పుడు ఇకడ విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపాడు. ఒక రూ.50 ఉంటే కాజీపేటకు పోతాను?’ అంటూ బతిమాలుకున్నాడు.