గీసుగొండ, డిసెంబర్ 7: జిల్లాలో వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్, ఆరోగ్య సిబ్బంది పనితీరును ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలన్నారు. కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందకుండా నిబంధనలు పాటించాలని కోరారు. విధిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి వేణుప్రసాద్, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
ముమ్మరంగా వ్యాక్సినేషన్
జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ తెలిపారు. 225 మంది సిబ్బందితో మంగళవారం 11,607 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 2,44,601 మందికి మొదటి డోసు, 1,39,316 మందికి రెండో డోసు టీకాలు వేసినట్లు వెల్లడించారు. 271 గ్రామాలు, 31 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. నర్సంపేట మండలంలో వేగంగా కరోనా టీకాల ప్రక్రియ కొనసాగుతున్నది. మంగళవారం భాంజీపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులకు టీకాలు వేశారు. ఇటుకాలపల్లిలో వ్యాక్సినేషన్‌ను సర్పంచ్ మండల రవీందర్, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి పరిశీలించారు.