హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 31 : కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో జిల్లావాసులు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి 12గంటలకు 2022కి వీడ్కోలు.. 2023కి వెల్కమ్ చెబుతూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు. మరోవైపు అర్ధరాత్రి నుంచే మహిళలు ఉత్సాహంగా ఇళ్ల ముందు వాకిళ్లను రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు.