INAVOLU | హనుమకొండ (ఐనవోలు): ఏకశిల స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడుయేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
మండలంలోని పున్నేల్ క్రాస్ సమీపంలోని ఏకశిల స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్స్, గోల్డ్. మోడల్స్ ను ప్రిన్సిపాల్ ఎండీ బాబా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రీ ప్రైమరీ పిల్లల్ని సైతం ఆట, పాట, మాటల్లో తర్పీదు ఇవ్వాలనే సంకత్సంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు.
గ్రాడుయేషన్ డే సెలబ్రేషన్ చెద్దామని ప్రణాళిక తెలియజేగానే ముందుకు వచ్చి శ్రమత్తో పిల్లల్ని కార్యోన్ముఖులుగా తయారు చేసిన యూకేజీ మథర్ టీచర్ జయకుమారి ప్లే వే ఇంచార్జీ నసీమాబేగం, అనూష, కొరియోగ్రాఫర్ కందిక రాజు, టీచర్లును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రవికిరణ్, టీచర్లు శ్రీనివాస్, అమర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.