హనుమకొండ, జూలై 30 : రేషన్ కార్డుదారులకు మరోసారి రేపటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా, ఇంకా షాపులకు సరఫరా ప్రక్రి య ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్న మైంది. ఈ నెల 27 వ తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదని డీలర్లు అంటున్నారు.
అంతేగాక బియ్యం పంపిణీ విష యంలో ప్రతి నెలా అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రేషన్ షాపులలో బియ్యం నిల్వల సామర్థ్యంతో పాటు, కార్డుదారుల నుంచి ఒక్కొక్కరికి మూడు సార్లు ఈ పాస్ యంత్రంపై వేలిముద్రలు తీసుకోవడం, మూడు సార్లు తూకం వేయడంతో సుమారు 20 నిమిషాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇరుకు గదులలో రేషన్ షాపుల నిర్వహణతో బియ్యం నిల్వ సామర్థ్యం ఇబ్బందిగా మారిందంటున్నారు.
రేషన్ కార్డుల ఈ-కేవైసీ ప్రక్రియకు నేడు గడువు ముగియనున్న నేప థ్యంలో పలు రేషన్ దు కాణాల వద్ద కార్డుదారులు భారీగా తరలివ స్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు కార్డుదా రుల నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే ఆలస్యం చేస్తు న్నారని, మరికొందరికి తిరిగి రావాలని సూచిస్తున్నారని ఆరోపిస్తు న్నారు. ఈ విషయంమై ఇన్చార్జి సివిల్ సప్లయి అధికారి మ హేందర్ ను ఫోన్లో సంప్రదించగా మాకు ఫిర్యాదులు అందితే చర్యలు తీసు కుంటామని, ఈ కేవైసీ పూర్తిగా ఉచితంగా చేయాలని చెప్పారు.