నర్సంపేట, జనవరి 14: పశు సంపద పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నర్సంపేట శాంతి సేనా రైతు సంఘం బాధ్యులు శనివారం డివిజన్‌స్థాయి పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించారు. శాంతిసేన రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు నాగలిని ఎమ్మెల్యేకు బహూకరించారు. పోటీలను ప్రారంభించిన అనంతరం పెద్ది మాట్లాడారు. రైతులకు సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. సాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారన్నారు.
గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు కృషి చేసినట్లు తెలిపారు. పాకాల, రంగాయ చెరువు ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో పంటలు బాగా పండుతాయన్నారు. రంగాయ చెరువు, మాదన్నపేట చెరువులను నీటితో నింపామని తెలిపారు. దీనివల్ల పంటల దిగుబడి కూడా పెరిగిందని తెలిపారు. రైతు సంఘాలతో ఎఫ్టీవోలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంఘాలతో విత్తన యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతుల పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ధాన్యం నిల్వల కోసం లక్షల టన్నుల గోదాములను నిర్మించామని ఎమ్మెల్యే పెద్ది వెల్లడించారు. రైతుల కోసం సబ్సిడీ కరంటు మోటర్లు, ట్రాక్టర్లు మంజూరు చేయించామని వివరించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, ఏసీపీ సంపత్‌రావు, ఎంపీపీ వేములపెల్లి ప్రకాశ్‌రావు, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, సర్పంచ్‌లు, శాంతిసేనా సంఘం గౌరవ అధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్రెడ్డి, చిలువేరు కుమారస్వామి, జేడీ వెంకటరమణ, బాలకృష్ణ, ఏడీ నర్సింహారెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, చిలువేరు కొమ్మాలు, ఈగ సత్యనారాయణ, మెండు అశోక్, బుర్ర మోహన్‌రెడ్డి, తౌటి వెంకటనారాయణ, సామ్యేల్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో పశువుల అందాల పోటీలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. శాంతిసేనా రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంక్రాంతికి పశువుల అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. జోడెడ్ల పోటీల్లో రాజారపు రాజయ్య ప్రథమ బహుమతిని సాధించారు. పొట్టేలు విన్యాసాల్లో జెజ్జంగి రాజ్‌కుమార్, కుక్కల పోటీల్లో కల్తీ రఘు, మేకపోతు పోటీల్లో వేల్పుల విక్రం, కోళ్ల పోటీల్లో అంద రమేశ్, ఆవుల పోటీల్లో పాల ప్రణయ్, చిన్నరాజు, దూడల పోటీల్లో చింతల నరేందర్, బర్రెల పోటీల్లో మజ్జిగ రాజు, నాడెం వీరన్న ప్రథమ బహుమతులు గెల్చుకున్నారు.