మళ్లీ ఉప్పొంగిన గోదావరి
గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,54,300 క్యూసెక్కులుగా 12.53 మీటర్ల ఎత్తును దాటి ప్రవహిస్తూ లక్ష్మీబరాజ్ వైపు పరుగులు తీస్తున్నది.
- కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవాహం
- రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం
- రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద దాటిన రెండో ప్రమాద హెచ్చరిక
కాళేశ్వరం, జూలై 26 : గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,54,300 క్యూసెక్కులుగా 12.53 మీటర్ల ఎత్తును దాటి ప్రవహిస్తూ లక్ష్మీబరాజ్ వైపు పరుగులు తీస్తున్నది.
పుష్కరఘాట్ పూర్తిగా మునిగిపోవడంతో భక్తులను స్నానాలకు అనుమతించడం లేదు. గంటగంటకూ గోదావరి పెరుగుతుండడంతో అధికారులు అక్కడే ఉండి గస్తీ కాస్తున్నారు. ఇక అన్నారం బరాజ్‌కు మానేరు, చిన్న, చిన్న కాల్వల ద్వారా 13,600 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన నీటిని మొత్తం 66 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి : మాజీ ఎంపీ మాలోత్ కవిత
Health tips | ఈ చెట్టు ఆకులతో మధుమేహం, ఊబకాయం రెండింటికీ చెక్ పెట్టొచ్చట.. ఎలాగో తెలుసా..!
Motkupalli Narsimhulu | రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే దళితుల పట్ల చులకన భావం : కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు
Drought Mandal | తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జాతీయ రహదారిపై నిరసన
Medical Expenses | భారత్‌లో భారీగా పెరుగుతున్న వైద్య ఖర్చుల వ్యయం.. ఒక్క ఏడాదిలోనే రూ.4.06 లక్షల కోట్ల ఖర్చు..
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

