ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జీఎం శ్రీనివాసరావు ప్రారంభించారు.
- భూపాలపల్లి జనరల్ మేనేజర్ బళ్లారి శ్రీనివాసరావు
- ఉచిత మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
- 1200 మందికి పైగా వైద్య పరీక్షలు, మందుల అందజేత
- తరలివచ్చిన పరిసర గ్రామాల ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే తె లంగాణ): సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జీఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ పరిసర గ్రామా ల అభివృద్ధి, మౌలిక వసతుల కోసం ఏటా సీఎస్ఆర్ నిధులతో అంతర్గత రోడ్లు, సైడు కాల్వల నిర్మాణం, తాగు నీటి వసతి కల్పన, ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం వృత్తి శిక్షణా కోర్సులు, తదితరాలను సంస్థ నిర్వహిస్తున్నదని తెలిపారు.
వైద్య శిబిరం.. అభినందనీయం
పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమ ని భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు అన్నారు. సింగరేణితో పాటు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పరిసర గ్రామాల్లో మౌలిక వ సతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
ఉచిత మెగా వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. కేటీకే ఓసీ-2 ప్ర భావిత గ్రామాలు గడ్డిగానిపల్లి, సెగ్గంపల్లి, ఆకుదారివాడ, కాశీంపల్లి, వేశాలపల్లి, బాలాజీనగర్, పకీరుగడ్డ, కాకతీయ కాలనీ, సుభాష్ కాలనీ, గాంధీనగర్, రాంనగర్, శాంతినగర్ కాలనీ వాసులు హాజర య్యారు. సుమారు 1200 మంది హాజరై, వివిధ పరీక్షలు చేయించు కున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, వార్డు కౌన్సిలర్లు ఆకుదారి మమత, నాగవెల్లి సరళ, దాట్ల శ్రీనివాస్, మురళీధర్, ఎస్ వోటూ జీఎం వెంకటయ్య, ఈఅండ్ఎం, ఐఈడీ ఏజీఎంలు రామలింగం, జ్యోతి, కేటీకే ఓసీ-2 పీవో వెంకట్రాంరెడ్డి, గని మేనేజర్ భిక్షమయ్య, ఏ రియా దవాఖాన డీవైసీఎంవో పద్మజ, డీజీఎం (సివిల్) కె.సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) అజ్మీరా తుకారాం, పర్సనల్ మేనేజర్ శివకేశవరావు, సీనియర్ పీవోలు శ్యాంప్రసాద్, ప్రశాంత్, క్రాంతికుమార్, టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఇన్చార్జి బడితల సమ్మయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్ కమిటీ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, సింగరేణి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మహ్మద్ ష రీఫ్, స్కౌట్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

