తుర్కయంజాల్,మే 16 : వరి సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ రాములు నాయక్ అన్నారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా చేపట్టిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలొని వార్డు కార్యాలయంలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటింలన్నారు. భూమిలో ఒకే రకమైన పంటను సాగు చేయకుండా పంట మార్పిడిని పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గోన్నారు.