శాయంపేట, నవంబర్ 30 : ‘మనం ఇంట్లో ఈ తిండి తింటామా? ఇంత ముద్దలా ఉంటే పిల్లలు ఎలా తింటారు? మరుగు దొడ్లకు డోర్లు లేకపోతే ఎలా?’ అని శాయంపేట మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకులం ప్రిన్సిపాల్ రేవతిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ‘పిల్లలకు కనీసం ఆరు నెలలు పాత బియ్యం ఇవ్వాల్సింది పోయి కొత్త బియ్యం పంపిస్తరా? ప్రభుత్వానికి చెప్పం డి’ అంటూ సూచించారు. బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి శనివారం హనుమకొండ జిల్లా శాయంపేటలోని జ్యోతిబాఫూలే బాలుర గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశా రు.
కొందరు పిల్లలతో మాట్లాడి చదువు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోవడంతో పాటు పలు రిజిస్టర్లను పరిశీలించారు. మరుగుదొడ్లలో కొన్నింటికి డోర్లు లేకపోవడం, మరికొన్ని విరిగి ఉండటంతో ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. స్టోర్‌రూంకు వెళ్లి కోడిగుడ్లు చిన్న సైజులో ఉండడంపై ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గురుకుల స్కూళ్లల్లో ఫుడ్పాయిజన్స్ జరిగి విద్యార్థులు చనిపోవడం బాధాకరమన్నారు. 7వ తేదీ వరకు బీఆర్ఎస్ గురుకుల బాటలో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు.
9 నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయని, అందులో ప్రస్తావిస్తామన్నారు. విద్యార్థులకు మంచి భోజనం, మెరుగైన విద్య అందించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. గురుకులంలో భోజనం ముద్దగా ఉండడం, మరుగుదొడ్లకు డోర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రులు సురేఖ, సీతక్క రాష్ట్రంలో ఫుడ్‌పాయిజన్ విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ హస్తం ఉందని మాట్లాడడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు హాస్టళ్లను విజిట్ చేసి విద్యార్థులతో మమేకమై, సమస్యలు తెలుసుకోవాలని హితవు పలికారు.
అనంతరం మండలంలోని పెద్దకోడెపాక హైస్కూల్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు టిఫిన్ బాక్సులను తెచ్చుకొని తింటుండటంతో పిల్లలతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. గండ్ర వెంట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, గోవిందాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు దాసి శ్రావణ్‌కుమార్, మాజీ ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, కొమ్ముల శివ, ఇటుకాల పాపారావు, రంగు ప్రభాకర్, అమ్మ అశోక్, కొడెపాక బాబు, పొడిశెట్టి గణేశ్, మగ్దుం పాషా తదితరులున్నారు.