ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్
పరకాల సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు. వారసత్వంగా వస్తున్న భూమిని రిజి స్ట్రేషన్ చేసేందుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేయ డంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారుల ను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామమైన సీతారాంపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు లడే శ్రీనివాస్, శ్రీకాంత్‌లు తమ తల్లిదండ్రుల పేరుతో ఉన్న 481/సీలో నాలుగు గుంటల భూమిని తమ పేరుపైన రెండు సమ భాగాలుగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేశ్‌ను సంప్రదించారు.
- గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 80 వేలు డిమాండ్
- పరకాలలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు తీసుకోగా పట్టివేత
పరకాల, జూలై 25: పరకాల సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు. వారసత్వంగా వస్తున్న భూమిని రిజి స్ట్రేషన్ చేసేందుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేయ డంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారుల ను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ విలీన గ్రామమైన సీతారాంపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు లడే శ్రీనివాస్, శ్రీకాంత్‌లు తమ తల్లిదండ్రుల పేరుతో ఉన్న 481/సీలో నాలుగు గుంటల భూమిని తమ పేరుపైన రెండు సమ భాగాలుగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేశ్‌ను సంప్రదించారు. ఈ విషయాన్ని నరేశ్ సబ్ రిజిస్ట్రార్ సునీత దృష్టికి తీసుకెళ్లగా రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ. 80వేలు డిమాండ్ చేసినట్లు చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
అవినీతి నిరోధక శాఖ అధికారు లు చెప్పిన ప్రకారం బాధితులు గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని నరేశ్‌కు రూ.80 వేల నగదు ఇచ్చారు. డబ్బులు ముట్టాయని అతను చెప్పడంతో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు శ్యాం, రాజు అక్కడే కాపుకాసి ఉన్న అధికారులు నరేశ్ నుంచి డబ్బులను స్వాధీనం చేసుకున్నారు.రెండు గంటలపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు, విచారణ చేపట్టి సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అన్ని పత్రాలు ఉన్నాయన్నా డబ్బులు డిమాండ్ చేసిన్రు
వారసత్వంగా వస్తున్న భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన్రు. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని చెప్పినం. అయినా కుడా డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పిన్రు. రెండు సమభాగాలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.80వేలు అవుతయ్. అవి ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో ఏసీబీ అధికారులను కలిశాం. ఈ నెల మొదటి వారంలో స్లాట్ బుక్ చేసుకున్నాం. – లడే శ్రీనివాస్, బాధితుడు, సీతారాంపురం
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

