కరీమాబాద్, మార్చి 4 : బీఆర్ఎస్ హయాంలోనే మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడుగులు పడ్డాయి. నాటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్రంతో పాటు జీఎంఆర్ సంస్థతో చర్చలు జరిపి ఎయిర్పోర్టు నిర్మాణానికి కృషిచేసింది. ఎన్నో ఏండ్ల పాటు సేవలందించిన ఈ ఎయిర్పోర్టు నాటి కాంగ్రెస్ హయాంలోనే మూతబడింది. దశాబ్దాల తర్వాత పునరుద్ధరణకు అడుగులు పడుతున్న వేళ ప్రజాప్రతినిధుల తలోమాటతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమికి భూమి ఇస్తామని ఒకరు..
డబ్బులిస్తామని మరొకరు చెప్పడంతో ఎవరి మాట నమ్మాలో తెలియక ఆగమవుతున్నారు. దీంతో పాటు గవిచర్ల రహదారిని మూసివేస్తే తమకు దారిని ఎలా ఏర్పాటు చేస్తారో కూడా ప్రజలకు చెప్పకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. భూమిలిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు అడిగినా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం శోచనీయం. జీవో కాదు డబ్బులు కేటాయించాలి. రైతులతో చర్చించాలి. మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాలి. కాలయాపన చేస్తే రైతులు కాదు ప్రజలు కూడా తిరగబడతారు.