కురవి, ఆగస్టు 29: నకిలీ పట్టాదారు పాస్‌బుక్స్ తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర వారం కురవి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తి రుపతిరావు వివరాలు వెల్లడించారు. కురవి మండ లం నేరడ శివారు ఎలచెట్టు తండా జీపీ పరిధిలో ని మంచ్యాతండాకు చెందిన మూడు బాలాజీ, మ హబూబాబాద్ మండలం అమన్‌గల్ శివారు కస్నా తండాకు చెందిన బానోత్ హరికిషన్, జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన బానోత్ వర్జన్ ముఠాగా ఏర్పడ్డారు.
వివిధ మండలాల్లోని రైతులను మభ్యపెట్టి మీకు ఎకువ లోన్ ఇప్పిస్తామని, దానికి ఖర్చవుతుందని నమ్మించారు. ఒక్కో పట్టాదారు పాస్బుక్కు రూ.10 వేలు వసూలు చేసి నకిలీవి సృష్టించారు. వీటి ద్వారా కురవిలోని యూనియన్ బ్యాంకు బ్రాంచిలో ఒకరికి, డోర్నకల్‌లో ఆరుగురికి, మహబూబాబాద్‌లో ఒకరికి, కెనరా బ్యాంకు బ్రాంచి మహబూబాబాద్‌లో ముగ్గురికి రూ.16.90 లక్షలు రుణాలుగా ఇప్పించారు. మరికొందరు పేరున నకిలీ పాస్‌బుక్స్ త యారు చేశారు.
వీటికి నకిలీ 1బీ, ఈసీలు తయారు చేయడానికి శుక్రవారం కురవికి రాగా పోలీసులు వీరిని పట్టుకున్నట్లు డీఎస్పీ తిరుపతిరావు చెప్పారు. ఈ ముఠాను అరెస్ట్ చేయకుంటే బ్యాంకులు సుమా రు రూ.కోటి వరకు రుణాలు ఇచ్చేవని వివరించా రు. నిందితుల నుంచి 23 నకిలీ పాస్‌బుక్స్, ల్యాప్‌టాప్, రెండు ప్రింటర్లు, కంప్యూటర్, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారని, కేసుతో సంబంధమున్న మరికొందరు పరారీలో ఉన్నారని వివరించారు. సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య, సీసీఎస్ సీఐ హతిరామ్, కురవి ఎస్సై సతీశ్ పాల్గొన్నారు.