ఏటూరు నాగారం : ఏటూరు నాగారం గ్రామపంచాయతీలో శుక్రవారం తై బజార్ వేలం నిర్వహించారు. వేలం పాటలో పలువురు వ్యాపారులు పాల్గొని వేలం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోటా పోటీగా పాట కొనసాగింది. రూ.2.50 లక్షలకు కురుకు హరికృష్ణ అనే వ్యక్తి గంప చిట్టిని దక్కించుకున్నాడు. గత ఏడాది రూ.1.65 లక్షలకు వెళ్లగా ఈసారి రూ.2.5 లక్షలకు చేరింది.
అదేవిధంగా కమేల పాటను కూడా నిర్వహించగా మరో వ్యక్తి రూ.90 వేలకు దక్కించుకున్నాడు. గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేలం పాట ద్వారా గ్రామ పంచాయతీకి రూ.3.5 లక్షల ఆదాయం ఏడాదికి రానుంది. వేలంపాటలో ఎంపీడీవో రాజ్యలక్ష్మి ఎంపీఓ కుమార్, పంచాయతీ కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.