హనుమకొండ, సెప్టెంబర్ 18: హనుమకొండ ఆర్యవైశ్య అఫీషియల్స్అండ్ ప్రొఫెషనల్స్అసోసియేషన్ (అవోపా) ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన ఆర్యవైశ్య విద్యార్థులకు 2025 ఈనెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆవోపా భవనంలో బంగారు పతకాలను అందజేస్తామని అవోపా అధ్యక్షులు దొంతుల ఈశ్వరయ్య తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
2024 – 25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు 10వ తరగతి నుంచి పీజీ, పీహెచ్డ్ వరకు ఉన్న అన్ని కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
ఆసక్తిగల విద్యార్థులు హనుమకొండ సుబేదారిలోని అవోపా కార్యాలయంలో దరఖాస్తు పత్రాలను సమర్పించాలని తెలిపారు. ఒక్కొక్క కోర్సులలో, అందిన దరఖాస్తులలో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు బంగారు పతకాలు ప్రధానం చేయడం జరుగుతుందని, మొత్తం 61 బంగారు పతకాలను ప్రధానం చేస్తామని తెలిపారు.
25లోపు దరఖాస్తుతో పాటు విద్యార్థి మార్కుల జాబితా, ర్యాంక్‌కార్డు, ఫొటో, ఆధార్‌కార్డు జతచేసి అందజేయాలని, మరిన్ని వివరాలకు 70930 35699 నెంబర్ని సంప్రదించాలని తెలిపారు. ఈ సమావేశంలో అవోపా కార్యదర్శి కమటాల భాస్కరరావు, కోశాధికారి గంపా సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గన్ను సురేందర్, పీఆర్వో పబ్బతి నాగభూషణం, విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.