హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 21 : జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్, నీట్లో 50 సంవత్సరాల అనుభవం ఉన్న ఎస్సార్ ఎడ్యు సెంటర్ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్లో చేరే విద్యార్థులకు ఈ నెల 24న హనుమకొండ వడ్డేపల్లిలోని ఎస్సార్ ఎడ్యుసెంటర్లో ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు. అర్హులైన విద్యార్థులకు వంద శాతం స్కాలర్షిప్ పొందే అవకాశం కల్పిస్తున్నామని, పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి సాల్కర్‌షిప్ పొందే అవకాశం ఉందన్నారు.
పటిష్టమైన ప్రణాళికలతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీ, నీట్ విద్యనందిస్తున్నామని, ఈ సంవత్సరం ఐపీఈలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు, జేఈఈ(మెయిన్), జేఈఈ(అడ్వాన్స్డ్), నీట్-23లో జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఉచిత స్కాలర్షిప్ టెస్ట్‌లో పాల్గొనే విద్యార్థులు 9642117830, 9642117330 నంబర్లలో సంప్రదించాలని కోరారు.