ఎల్కతుర్తి, ఏప్రిల్ 21 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న సభకు అన్ని వర్గాలు సహకరిస్తున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. రజతోత్సవ బహిరంగ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. సోమవారం సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయ న పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు ముగిశాయని, ప్రజలు స్వచ్చంధంగా తరలివచ్చేందుకు ఉ త్సాహంగా ఉన్నారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో అనుకున్న దానికంటే అధికంగా లక్షలాదిగా ప్రజ లు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, రైతులు, ప్రజలకు ఎ లాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయాల కోసం ఏదో చేస్తున్నారని, దానిని ప్రజలే తిరస్కరిస్తారన్నారు. సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు, అభిమానులు వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయ న మాటలు వినేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు.
ఈ నెల 22 (మంగళవారం)న పనులు సభా స్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని తెలిపారు. అలాగే నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చి తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూసుకొని వెళ్లాలని చెప్పినట్లు ఎర్రబెల్లి తెలిపారు. వారి వెంట కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం తదితరులున్నారు.
బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ. రజతోత్సవ సభ బ్రహాండంగా జరుగుతుంది. 165 ఎకరాల్లో సభా ప్రాంగణం పనులు పూర్తి కావచ్చాయని, పార్కింగ్‌కు సిద్దిపేట-కరీంనగర్-వరంగల్ రూట్లలో ఏర్పాట్లు చేశాం. ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారు. అయితే సభకు రైతులందరు ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఈ సభ ఎవరికి వ్యతిరేకంగా, విమర్శల కోసం నిర్వహించడం లేదు. ఇది 14 ఏండ్లు కొట్లాడి, పదేండ్లు స్వర్ణయుగం లాంటి పాలన అందించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ.
– పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ