గీసుగొండ, డిసెంబర్ 13 : అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రాజన్న కోడెల విక్రయ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని, జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని బీజేపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కాళీప్రసాద్‌రావు, రాష్ట్ర నాయకుడు విజయచందర్‌రెడ్డి డి మాండ్ చేశారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ ధర్మారం శివారులో బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి సురేఖ సిఫారసు మేరకు ఆలయ అధికారులు 66 కోడెలను రాంబాబు, మందస్వామి, పసునూటి శ్యామ్సుందర్కు ఇచ్చినట్లు పో లీసుల విచారణలో బయటపడిందన్నారు.
మంత్రి సురేఖ హిందువుల మనోభావాలను కించపరిచేలా కోడెల వ్యవహారంలో అవకతవకలు జరగలేదంటూ నిందితులకు వ త్తాసు పలుకుతూ ప్రకటన చేయడం సిగ్గు చేటన్నారు. దీని కి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ బాధ్యత వహిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. హిం దువులను కించపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని, భక్తులు దేవుడికి సమర్పించే కోడెలను విక్రయించడమంటే హిందువులపై దాడి చేసినట్లేనని అన్నా రు. రాంబాబు అన్యమతస్తుడని, అతడికి హిందూ దేవాలయం నుంచి కోడె లు ఇవ్వడం, వాటిని కబేళాలకు విక్రయించడం దారుణమన్నారు.
ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి స్పందించాలన్నారు. ఇందులో మండ ల నాయకుల హస్తం ఉందన్నారు. వేములవాడ ఈవోను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. జరిగిన తప్పును మంత్రి ఒప్పు కోకుండా ఆ విషయాలను వెలుగులోకి తెచ్చిన పత్రికలపై కేసులు పెడతామని బెదిరించడం ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ విషయంపై గీసుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మా నాయకులకు ఏం జరిగినా రాష్ర్టాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు. మండల అధ్యక్షుడు జాన్విక్రమ్, నియోజకవర్గ కన్వీనర్ ములక ప్రసాద్, నాయకులు కక్కెర్ల శ్రీనివాస్, రాజు, ల్యాద రాజేశ్, కే రవి, అఖిల్, వెంకన్న, రాజిరెడ్డి, సాంబరాజు, బాలరాజు, రాము, ప్రదీప్ పాల్గొన్నారు.