నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానున్నది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లు వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తూర్పు రిటర్నింగ్ అధికారి కావడంతో బల్దియాలోని ఆయన చాంబర్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
- గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ నామినేషన్లు
- 10 వరకు అభ్యర్థుల నుంచి స్వీకరణ
- ఉదయం 11 నుంచి 3 గంటల వరకు సమయం
- ఏర్పాట్లను పరిశీలించిన ఆర్వో రిజ్వాన్ బాషా, డీసీపీ బారి
వరంగల్, నవంబర్ 2: ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానున్నది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నామినేషన్లు వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వీకరించనున్నారు. గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తూర్పు రిటర్నింగ్ అధికారి కావడంతో బల్దియాలోని ఆయన చాంబర్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 20 సీసీ కెమెరాలు అమర్చారు. బారికెడ్లను ఏర్పాటు చేశారు. నామినేషన్లు స్వీకరించే చాంబర్‌కు వెళ్లే దారిలో ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్వో కార్యాలయంగా ఉన్న కార్పొరేషన్ ఆఫీసులో ఎన్నికల కంట్రోల్ రూమ్, వివిధ అనుమతుల మంజూరు కోసం సువిధ సెల్, ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఎక్స్పెండిచర్ సెల్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై నిరంతర నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఫ్లయింగ్ స్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ బృందాలు, వీడియో బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంతా రిటర్నింగ్ అధికారి కార్యాలయం బల్దియా నుంచి పర్యవేక్షించనున్నారు.
సమయం ముగిస్తే తిరస్కరణ
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థితో కేవలం నలుగురిని మాత్రమే అనుమతించనున్నారు. సమయం ముగిసిన తర్వాత ఎలాంటి నామినేషన్లను అనుతించమని రిటర్నింగ్ అధికారి రిజ్వాన్ బాషా తెలిపారు. ఒక అభ్యర్థి రెండు చోట్ల మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుందని, నాలుగు సెట్ల నామినేషన్లు మాత్రమే వేయాలని సూచించారు. అభ్యర్థులకు నామినేషన్ల సమర్పణ సులువుగా ఉండేందుకు ఐదు కౌంటర్లతో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశామని ఆర్వో తెలిపారు. సిబ్బంది అవగాహన కోసం మాక్ నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఆర్వో
నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ బారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్లు వేసే చాంబర్ నుంచి 100 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని వారు అధికారులకు సూచించారు. అలాగే, మీడియా పాయింట్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి రూ. 40 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలులేదన్నారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి డిక్లరేషన్ సమర్పించాలన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ బారి మాట్లాడుతూ నామినేషన్లు వేసే అభ్యర్థులు అరగంట ముందే కార్యాలయానికి రావాలన్నారు. చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణి సరికాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, డీపీఆర్వో అయూబ్ అలీ, ఏసీపీ బోనాల కిషన్, తహసీల్దార్ ఇక్బాల్, వెంకటేశ్వర్లు, ఎన్నికల డీటీ మధుసూదన్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

