హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 23: హనుమకొండ మలేషియాలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని హనుమకొండకు తిరిగివచ్చిన సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్‌కుమార్‌ను కోచ్‌లు ఘనంగా సన్మానించారు. జిల్లా కీర్తిని అంతర్జాతీయస్థాయిలో చాటిన అశోక్‌కుమార్‌ను పలువురు అభినందించారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చెందిన అశోక్‌కుమార్ వరంగల్ నిట్ ప్రొఫెసర్ పి.రవికుమార్ పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహహ్మద్ అజిజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు శ్యామల పవన్‌కుమార్, తోట శ్యాంప్రసాద్, కోచ్‌లు వి.నరేందర్, శ్రీమన్నానారాయణ, అఫ్జల్, రమేశ్, నవీన్, సిబ్బంది ఉన్నారు.