హనుమకొండ చౌరస్తా, నవంబర్ 30 : క్షిపణి సాంకేతికతలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మా ర్చడంలో యువతరం ముందుంటున్నదని , డీఆర్డీవోకు ఉజ్వల భవిష్యత్ ఉందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 22వ స్నాతకోత్సవాన్ని చైర్పర్సన్, డైరెక్టర్ బిద్యాధర్ సుబు ధి ఆధ్వర్యంలో శనివారం అంబేదర్ లెర్నింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించా రు.
ముఖ్యఅతిథిగా హాజరైన సమీర్ వీ కామత్ 1,875 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా ఇందులో 11 మంది బంగారు పతకాలు అందుకున్నారు. ఉత్తమ పీహెచ్డీ థీసిస్, పీజీ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ నిట్ వరంగల్ పూర్వవిద్యార్థులు డీఆర్డీవోతో సహా ప్రపంచవ్యాప్తంగా విభిన్న రంగాలకు సహకరిస్తున్నారని చెప్పా రు. నిజానికి డీఆర్డీవోలో తన మొదటి బాస్ నిట్ వరంగల్‌కు చెందిన పూర్వవిద్యార్థి డాక్ట ర్ మాన్కొండయ్య అని, ఆయన మార్గదర్శకత్వంతోనే తాను ఈ రోజు ఇకడ ఉన్నట్లు గుర్తుచేశారు. అనంతరం గ్రాడ్యుయేట్లను, పతక విజేతలను సమీర్ అభినందించారు.