ఫ్లెక్సీలు, బొకేలకు ఖర్చు పెట్టొద్దు
పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బొకేలకు పెట్టే ఖర్చులను ప్రజల అవసరాలకు వినియోగించాలని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచితంగా 6,200 కుట్టుమిషన్లు అందజేశారు.
- వాటిని ప్రజా అవసరాలకు వినియోగించా..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు
- కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’
- పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
మడికొండ, జూలై 23 : పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బొకేలకు పెట్టే ఖర్చులను ప్రజల అవసరాలకు వినియోగించాలని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచితంగా 6,200 కుట్టుమిషన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన స మావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ తన బర్త్‌డే సందర్భంగా 2019లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆరు అంబులెన్స్‌లను సొంత ఖర్చులతో ప్రభుత్వానికి అందజేసినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు కూడా 117 అంబులెన్స్‌లను అందజేశారని తెలిపారు. దివ్యాంగులకు 2వేల ట్రై స్కూటీలు, విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అనేక గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై రూ. 1.20 లక్షలు ఖర్చు చేసి ప్రపంచంతో పోటీపడేలా తయారు చేసినట్లు చెప్పారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2017లో అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్‌లో 1350 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసినట్లు, ఇం దులో పరిశ్రమలు ప్రారంభిస్తే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే కైటెక్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు తాను చేసిన కృషిని వివరించారు. కరోనా కాలంలో కూడా అనేక దేశాలు తిరిగి పెట్టుబడులను రాబట్టినట్లు గుర్తు చేశారు.
జిల్లాకో మెడికల్ కా లేజీ ఏర్పాటు చేసి అనుబంధంగా దవాఖానలను నిర్మించినట్లు చెప్పా రు. అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. అంతకుముందు సమావేశంలో లైట్స్ ఆఫ్ చేసి సెల్‌ఫోన్స్ టార్చ్‌తో మహిళ లు కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, సతీశ్ కుమార్, నాయకులు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, పెద్ది స్వప్న, లలితాయాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

