భీమదేవరపల్లి, ఏప్రిల్ 20: సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాంకేతిక కోర్సులు చదువుతున్న సంఘం సభ్యుల పిల్లలకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. సభ్యుల పిల్లలు ఎప్సెట్-2024 మొదటి సంవత్సర్ విద్యార్థిని, విద్యార్థులకు (మెడిసిన్, డెంటల్, ఫార్మా-డి – రూ.20,000, ఇంజినీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్/హార్టికల్చర్/నర్సింగ్ రూ.15,000) 112 మందికి రూ.17,30,000 ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేసినట్లు అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రోత్సాహక బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని 2008 లో ప్రారంభించి, 2008 నుండి 2024 వరకు 1355 విద్యార్థులకు ఇప్పటి వరకు రూ.1,22,53,500.00లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సంఘం నిర్వహిస్తున్న కార్యకలాపాలను తెలిపే డాక్యూమెంటరీని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జీఎం రాం రెడ్డి, ఉపాధ్యక్షుడు కడారి ఆదాం, సంఘ కార్యవర్గ సభ్యులు కంకల భాగ్య, కూన కనకయ్య, మారుపాటి జయపాల్ రెడ్డి, అంబాల రాములు, గజ్జి వీరయ్య, బేల కనకమ్మ, కంది రవిందర్ రెడ్డి, ఈర్ల మూగయ్య, కర్రె మహేందర్, మండ శ్రీనివాస్, చెవ్వల్ల బుచ్చయ్య, గుగ్లోతు బాషు, బొల్లపెల్లి వీరన్న పాల్గొన్నారు.