కాశీబుగ్గ, మే 12 : పోలింగ్ సాఫీగా సాగేలా చూడాలని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం ఎనుమాముల మార్కెట్ యార్డులో జరిగిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు బండారి స్వాగత్ రణ్వీర్ చంద్‌తో కలిసి ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ..
ఎన్నికల విధులు పక్కాగా నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు రూట్‌మ్యాప్ ఆధారంగా పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన బస్సుల్లో ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లారని, ప్రతి బస్సుకు పోలీసులు ఎస్కార్ట్‌గా వెళ్లారన్నారు. ఏఆర్వోలు అశ్వినీ తానాజీ వాకడే, సిదం దత్తు, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు, విజయ్ సాగర్ పాల్గొన్నారు.