అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం కలిగేనా
మహా నగరంలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ ప్రజలను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ దశాబ్దాలుగా ఊరి స్తూ డీపీఆర్‌ల స్థాయిలోనే ఆగిపోతున్నది. స్మార్ట్‌సిటీ పనులు సగంలోనే ఉన్నాయి.
- దశాబ్దాలుగా నగరవాసులకు కలగానే..
- అసంపూర్తిగా నగర అభివృద్ధి
- ఈసారీ వరద ముంపు తప్పదా?
- కాగితాల్లోనే ‘కుడా’ మార్క్ పనులు
వరంగల్, జూన్ 27 : మహా నగరంలలో ఏళ్ల తరబడి అభివృద్ధి పనులు సాగుతూనే ఉన్నాయి. మేజర్ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. వరంగల్ ప్రజలను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ దశాబ్దాలుగా ఊరి స్తూ డీపీఆర్‌ల స్థాయిలోనే ఆగిపోతున్నది. స్మార్ట్‌సిటీ పనులు సగంలోనే ఉన్నాయి. ఏ ఒక్క అభివృద్ధి పనీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరంగా చెప్పుకునే వరంగల్ అభివృద్ధి ముందుకు సాగడం లేదు. స్మార్ట్, అమృత్, హృదయ్ వంటి కేంద్ర పథకాల్లో నగరానికి చోటు దక్కినా ఆశించిన ప్రగతి జరుగలేదు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అభివృద్ధి అంతా కాగితాల్లోనే కనిపిస్తోంది. నగరంలో జంక్షన్ల అభివృద్ధి మినహా కుడా చేపట్టిన పని ఒక్కటీ పూర్తి కా లేదు. ఇన్నర్ రింగ్‌రోడ్, నియో మెట్రో మ ధ్యలోనే ఆగిపోయాయి. ముఖ్యం గా 2047 విజన్‌లో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ది అయోమయ పరిస్థితి. మార్పులు, చేర్పుల మధ్య ప్రభుత్వం వద్ద పెడింగ్‌లో ఉంది.
ఊరిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఏళ్ల తరబడి అంచనాలు చేసి ప్రభుత్వాలకు పంపించడంతోనే సరిపోయింది. తొలుత రూ.400 కోట్లతో చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంచనాలు ప్రస్తుతం రూ. 2200 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇప్పటికీ ఇది ఎన్నికల హామీగా మిగిపోయింది. 24 విలీన గ్రామాలతో నగర విస్తీర్ణం 407.71 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. స్మార్ట్‌సిటీగా చెప్పుకుంటున్న వరంగల్ మహా నగరం ప్రతి ఏడాది వరదల్లో మునుగుతోంది. వందలాది గృహలు, వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్ని అవస్థలు పడుతున్నారు. ఈ వర్షాకాలంలోనూ నగరానికి వరద ముంపు తప్పేట్లు లేదు. గతేడాది చేపట్టిన నాలాల విస్తరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. చారిత్రక వరంగల్ నగరం శాశ్వతంగా వరద ముంపు నుంచి విముక్తి చెందాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు..
కుడా ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు లొల్లి తెగడం లేదు. దశాబ్దకాలంగా ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొలిక్కిరాలేదు. కేవలం 8 కిలోమీటర్ల మేర చేసిన భూ సేకరణ అంతా గందరగోళంగా మారింది. నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఎనుమాముల రెండో గేట్ వరకు చేపట్టిన భూసేరణలో ఇంకా అనేక మంది రైతులకు డబ్బులు చెల్లించలేదు. ఇప్పటికి చాలామంది రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రెండో గేట్ నుంచి కొత్తపేట మీదుగా ఆరెపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వరకు భూ సేకరణ కొత్త విధానంతో ముం దుకు సాగడం లేదు. ఫిఫ్టీ.. ఫిఫ్టీ పద్ధతిలో భూసేరణ చేస్తామన్న కుడా అధికారుల ప్రతిపాదనలను రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అక్కడి రాకుండా అడ్డుకున్నారు.
స్మార్ట్ అంతా సగం సగం..
స్మార్ట్‌సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ సగం సగం పూర్తయ్యాయి. ట్రాఫిక్, తాగునీటి సరఫరాతో పాటు అనేక స్మార్ట్ సేవలు అందిందుకు రూ. 100 కోట్లతో మొ దలు పెట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ), బల్దియా చెత్త సమస్యకు పరిష్కారం చూపేందుకు చేపట్టిన బయోమైనింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇంకా కొన్ని పనులు మొదలు కాలేదు. రోడ్లు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఐదేళ్ల స్మార్ట్‌సిటీ పథకం గడువు ముగుస్తు న్నా అభివృద్ధి పనులు అలాగే ఉన్నాయి.
కాగితాల్లోనే కుడా అభివృద్ధి..
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చేసిన అభివృద్ధి అంతా కాగితాల్లోనే కనిపిస్తోంది. నగర జంక్షన్ల అభివృద్ధి మినహా నగరంలో కుడా ఎక్కడా లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు, మాస్టర్ ప్లాన్, నియో మెట్రో రైల్, ఆక్సిజన్ పార్క్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఏ ప్రాజెక్టునూ పూర్తి చేసింది లేదు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

