నత్తనడకన డిజిటలైజేషన్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాదాపు 99 శాతం ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు.
- ఉమ్మడి జిల్లాలో 15.90 శాతమే ఆన్లైన్
- గ్రేటర్ వరంగల్ పరిధిలోనే అత్యల్పం
- సర్‌కు మరో 16 రోజులే గడువు
- ఆలోగా పూర్తయ్యేది అనుమానమే..
- 99 శాతం ఈఎఫ్‌ల పంపిణీ పూర్తి
- ఫామ్స్ నింపడంలో ఇబ్బందులతోనే ఆన్లైన్ ఆలస్యం
హనుమకొండ, జూలై 7 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాదాపు 99 శాతం ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పటికీ డిజిటలైజేషన్‌పై అధికారులు దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు కేవలం 15.90 శాతం డిజిటలైజేషన్ మాత్రమే జరిగింది. సర్ ప్రక్రియకు మరో 16 రోజుల గడువే ఉండడంతో ఆలోపు డిజిటలైజేషన్ పూర్తవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సేకరించిన ఫామ్స్‌ను వెంటనే ఆన్లైన్ చేయకపోతే చివరి దశలో పనిభారం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నది. అయితే ఈఎఫ్‌లు నింపే విషయమై అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీంతోనే డిజిటలైజేషన్ ఆలస్యమవుతున్నదని కొందరు బీఎల్వోలు అంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 5,09,014 మంది ఓటర్లున్నారు. బుధవారం వరకు మొత్తం 5,08,381 మందికి ఫామ్స్ పంపిణీ చేశారు. వీటిలో కేవలం 62,720 (12.32 శాతం) ఫామ్స్‌ను మాత్రమే డిజిటలైజేషన్ చేశారు.
అలాగే మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల పరిధిలో 4,84,935 మంది ఓటర్లుండగా 4,84,140 ఈఎఫ్‌లు పంపిణీ చేశారు. ఇందులో 60,426 (12.46 శాతం) ఫామ్స్‌ను ఆన్లైన్ చేశారు. జనగామ జిల్లా పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,67,484 మంది ఓటర్లలో 7,67,431 మందికి ఫామ్స్ పంపిణీ చేసి, ఇందులో 1,40,268 (18.27 శాతం) డిజిటలైజ్ చేశారు. వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో 7,76,953 మంది ఓటర్లుండగా వీరిలో 7,65,190 ఈఎఫ్‌లు పంపిణీ చేశారు. ఇందులో 84,686 (11.26 శాతం) ఫామ్స్‌ను డిజిటలైజ్ చేశారు.
కాగా, మిగతా నియోజకవర్గాలతో పోల్చితే గ్రేటర్ వరంగల్ పరిధిలో ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ అత్యల్పంగా జరిగింది. వరంగల్ తూర్పులో 5.25 శాతం, వరంగల్ పశ్చిమలో 6.55 శాతం ఆన్లైన్ జరుగగా, వర్ధన్నపేటలోనూ 6.83 శాతం నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లిలో 25.85, ములుగులో 24.92, స్టేషన్‌ఘన్‌పూర్ 24.73, నర్సంపేటలో 21.70 శాతం డిజిటలైజేషన్ జరిగింది. కాగా, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 100 శాతం ఎన్యుమరేషన్ ఫామ్స్ పంపిణీ పూర్తికావడం విశేషం.
ఫామ్స్ నింపేందుకు హెల్ప్ డెస్క్
నర్సింహులపేట, జూలై 8 : చదువు వచ్చిన వాళ్లు, రాని వారు సైతం సర్ ఫామ్స్ ఎలా నింపాలో తెలియక తికమకపడుతున్నారు. బీఎల్వోలకు సాంకేతిక అవగాహన లేకపోవడం, 2002 నాటి ఓటరు వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహాయక కేంద్రాలు (హెల్ప్ డెస్క్‌లు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు ప్రజలు వెళ్లి తమ ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపించుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానిక తహసీల్దార్ రమేశ్‌బాబు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో జీపీవోలతో పాటు చదువుకున్న యువకులు, సిబ్బందితో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా వివరాలు

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

