హనుమకొండ చౌరస్తా, మార్చి 1 : వరంగల్ నిట్‌లో వార్షిక సాంస్కృతిక వేడుక విద్యార్థుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చిం ది. స్ప్రింగ్ స్ప్రీ రెండో రోజు వివిధ సాంసృతిక, సృజనాత్మక కలగలపి నిర్వహించిన 18 ప్రత్యేక ఈవెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హ్యాండ్ ప్రింటింగ్ (వా ల్యూ ఎడ్యుకేషన్ క్లబ్ అండ్ ఎన్ఎస్ఎస్)- విద్యార్థులు తమ చేతిముద్రలను చకగా వేయడం ద్వారా జ్ఞాపకాలుగా నిలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. కుండల తయారీ(పాటరీ) (ఎన్ఎస్ఎస్)-మట్టితో చేతిపనికి ఒక అనుభూతి ని అందించే కార్యక్రమం, స్నేక్స్ అండ్ లాడర్స్(యూత్ రెడ్ క్రా స్)-చిన్న పిల్లల ఆటను నిజజీవిత అనుభూతితో వినూత్నంగా నిర్వహించారు.
యన్సాల్వడ్ (లిటరరీ అండ్ డిబేట్ క్లబ్) నిఘా, విచారణ ఆధారంగా నడిచే డిటెక్టివ్ గేమ్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ(ఫొటోగ్రఫీ క్లబ్)- సాంసృతిక అంశాలను 15 నిమిషాల్లో ఫొటోరూపం లో అందించే పోటీలు కట్టిపడేశాయి. పోలరాయిడ్ ఫొటోగ్రఫీ(ఫొటోగ్రఫీ క్లబ్)-వెంటనే తక్షణ ఫొటోలను తీసుకొని గుర్తుగా ఉంచుకునే ప్రత్యేక అనుభవం, ఆర్ట్ థెరపీ (పెయింటింగ్ క్లబ్)-చిత్రలేఖ నం ద్వారా భావాలను వ్యక్తీకరించే చికిత్సాత్మక కార్యక్రమం, తానా బానా (ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్)- సంప్రదాయ ఆహారాలు, వస్త్రధారణ, పద్ధతులపై అవగాహన పెంచే ఆట ఏర్పాటు చేశారు. ట్రెజర్ హంట్(లిటరరీ అండ్ డిబేట్ క్లబ్)-సాంసృతిక విషయాలపై ఆధారపడి సావెంజర్ హంట్ పోటీ నిర్వహించి ఆకట్టుకున్నారు.
చివరి రోజైన ఆదివారం అల్ల్యూర్-ఆకర్షణీయమైన ఫ్యాషన్ షో, డీజే నైట్ ఉంటుంది. నుకడ్ నాటక్(వీధి నాటిక ప్రదర్శన), అరోహన్-జూలియస్, సీజర్ కథపై నాటక ప్రదర్శన, మైథాలజీ క్విజ్-పురాణ గాథలపై పరీక్షించే ప్రశ్నాపోటీ, బ్లిట్జ్ బుల్లెట్ -చెస్ పోటీ నిర్వహించనున్నారు.
నిట్ గ్రౌండ్లో ప్రోషోలు అందరినీ అలరించాయి. ఈ ఉత్సవ ప్రత్యేక ఆకర్షణగా తెలుగు సినిమా మ్యాడ్ స్వేర్ చిత్రబృందం నిట్ క్యాంపస్‌ను సందర్శించి విద్యార్థులతో ఉత్సాహభరితంగా మాట్లాడారు. అనంతరం ప్రముఖ నేపథ్యగాయని గీతామాధురి తన మధుర గానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇక రాత్రిని మ రింత రసవత్తరంగా మార్చిన కొరియో నైట్ పోటీ, వివిధ నృత్యబృందాల అద్భుత ప్రదర్శనలతో కొనసాగింది.