వరంగల్ చౌరస్తా, జనవరి 19: కేఎంసీ పారా మెడికల్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న 94సీట్ల భర్తీకి రెండో విడుత, మాప్ అప్ కౌన్సెలింగ్
నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 23న కళాశాలలో ఉదయం 8.30 గంటల నుంచి
కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
డీఎంఎల్టీ 15, డీఏఎన్ఎస్ 1, డీ కార్డిమో 3, డీఆర్జీఏ 2, డీడీఆర్ఏ 6, డీఈసీజీ 6, డీడీఏఐఎల్వై 2, డీఓఏ 12, డీఎంఎస్టీ 10, డీఎంఐటీ 12, డీఆర్ఈఎస్టీ 17, డీఈపీటీ 8 విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. మొదటి విడుత కౌన్సెలింగ్‌లో సీటు పొందినవారు సైతం ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.