Warangal chowrasta | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహణ
విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు.
వరంగల్ చౌరస్తా: విద్యార్థులలోని విజ్ఞానాన్ని మరింత పెంపొందించడం కోసం టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాద్యాయులు భూక్యా హేమంత్ అన్నారు. సోమవారం యాకుబ్ పురలోని పాఠశాలలో వరంగల్ జిల్లా సోషల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ టాలెంట్ టెస్టుల ద్వారా విద్యార్ధుల్లోని విజనాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం దొరికినట్లు అవుతుందని అన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాదానం చేయడం ద్వారా భవిష్యత్తు పరీక్షల్లో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుందని అన్నారు. తెలుగు విభాగంలో ప్రధమ బహుమతి విజేత ఎండీ షకీరా (జిల్లా పరిషత్ హై స్కూల్ రాయపర్తి), ద్వితీయ బహుమతి పి.ప్రణీత్ (జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తూరు), తృతీయ బహుమతి ఎస్కే. ఇమ్రాన్ (జిల్లా పరిషత్ హై స్కూల్, చెన్నారం) ఇంగ్లీష్ విభాగంలో మొదటి విజేతగా హాసినీ (టీఎస్ఆర్ఎస్, నెక్కొండ), ద్వితీయ విజేత ఎండీ ముదాసిర్ (కిష్ణకాలనీ ప్రభుత్వ పాఠశాల, వరంగల్), తృతీయ విజేతగా బి. వినయ్ (జిల్లా పరిషత్ హై స్కూల్ లింగాపురం) విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ సృజన్ తేజ, జీసీడీఓ ఫ్లోరెన్స్, డీసీఈబీ సెక్రెటరీ కృష్ణమూర్తి, ఉసీజీ అరుణ, సోషల్ ఫోరం ప్రతినిధులు, పాఠశాల భోధనా, భోదనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

