హనుమకొండ, నవంబర్ 9 : పాలన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకుల దిగజారుడు మాటలపై శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ సెంటర్ వద్దకు వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొనే క్రమంలో తోపులాట జరిగింది. అనంతరం దాస్యం మాట్లాడుతూ హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు.
పాలన చేతకాక ప్రతిపక్ష నాయకులపై పాపపు మాటలు మాట్లాడు తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ బీఆర్ఎస్ తెస్తే బ్యాడ్ ఇమేజ్ను కాంగ్రెస్ తీసుకొస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యా యాలు, హామీలను అడుగుతుంటే అకసుతో కేసుల పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆకాశంపై ఉమ్మి వేయడమేనని ఆయన పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇండ్ల కూల్చివేతలకు మాత్రమే వ్యతిరేకమని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మూసీ నది సుందరీకరణ పేరుతో పెద్ద మొత్తంలో అవినీతి జరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అడ్డుకుంటే వారిపై బుల్డోజర్లు ఎకిస్తారా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ రైతులకు రైతు బంధు లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. 75 ఏండ్లలో దాదాపు 50 ఏండ్లు పాలించింది కాంగ్రెస్‌పార్టే కదా.. మరి మూసీ కలుషి తం కావడానికి కారణం కాంగ్రె స్ కాదా అని ప్రశ్నించారు. మురుగు నీటిని శుద్ధి చేయడం తో పాటు కాంగ్రెస్ నాయకుల నోళ్లల్లో ఉన్న మురికిని ముందుగా శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేసిన దిగజారుడు మాటలపై సుబేదారి పోలీస్ స్టేషన్లో వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌రావు, బొండు అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, పశ్చిమ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, విద్యార్థి సంఘం నాయకుడు రాకేశ్ యాదవ్, రఘు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.