వెంకటాపూర్, అక్టోబర్ 26 : వలంటీర్స్ వ్యక్తిత్వ వికాసాన్ని పెం పొందించుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అన్నారు. శనివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్పలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యం లో తెలంగాణ టూరిజం శాఖ, భారత పురావస్తు శాఖ, ఐకోమస్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్, యు వ టూరిజం క్లబ్ సభ్యుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది.
ము గింపు కార్యక్రమానికి కలెక్టర్ టీఎస్ దివాకర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య ముఖ్యఅతిథులుగా హా జరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలంటీర్స్ శిక్షణలో నేర్చుకున్న విషయాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కృషి చేయాలని అన్నా రు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాండురంగారావును, వలంటీర్స్ కో ఆర్డినేటర్ శ్రీధర్‌రావు, యు వ టూరిజం క్లబ్ కో ఆర్డినేటర్, అసిస్టెంట్ టూరిజం ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా టూరి జం అధికారి శివాజీ, కేంద్ర పురావ స్తు డిప్యూటీ సూపరింటెండెంట్, సీఏ మల్లేశ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ స భ్యులు శ్రీధర్‌రావు, శ్రీనివాస్, బా బు, టూరిజం గైడ్స్, టూరిజం, పురావస్తు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.