Collector Diwakara | జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం అభినందనీయం : కలెక్టర్ దివాకరం
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.
ములుగు : యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. ఇటీవల ములుగు జిల్లా కేంద్రంలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన తొగరి శంకర్ కుటుంబానికి తోటి జర్నలిస్టులు 25 వేల రూపాయల సాయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందజేశారు.
తొగరి శంకర్ గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలంటూ వివిధ ప్రచార మాధ్యమాల్లో మీడియా గ్రూపుల్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడమటింటి నగేష్, చల్ల గురుగుల రాజుల ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా 25 వేల రూపాయలు సేకరించారు. ఈ మొత్తాన్ని పోస్టల్ బాండ్ రూపంలో జర్నలిస్ట్ శంకర్ కుమార్తె సహస్రకు జిల్లా కలెక్టర్ అందజేశారు.
ఇంత మంచి కార్యక్రమానికి ముందుండి విరాళాలను సేకరించిన పడమటింటి నగేష్ , చల్లగురువుల రాజు, సంఘ రంజిత్ లను కలెక్టర్ అభినందించారు. తమ వంతు సహాయంగా శంకర్ కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీలైనంత సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధితులు జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు చెందినవారు కావడంతో అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి సాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, చల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

