మహదేవపూర్, ఫిబ్రవరి 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌ను ఈ నెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 50 మంది ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించనున్నారు. బరాజ్‌ను స్వయంగా పరిశీలించేందుకు సుమారు 40 బస్సుల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రానున్నారు. బరాజ్‌ను పరిశీలించిన అనంతరం అక్కడే అధికారులతో సమీక్షించను న్నారు. ఈ సందర్భంగా బరాజ్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.