సుబేదారి, అక్టోబర్1 : మంత్రి కొండా సురేఖ అనుచరుడు, మాజీ రౌడీషీటర్ నవీన్ రాజ్ డ్యూటీలో ఉన్న ఓ పోలీసు అధికారిపై ఓవరాక్షన్ ప్రదర్శించగా, ఆయన పోలీసు ైస్టెల్లో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగళవా రం వరంగల్‌లోని ఇస్లామియా జూనియర్ కాలేజ్ మైదానంలో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ హాజరై వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు అడ్డువచ్చారు.
బందోబస్తు డ్యూటీలో ఉన్న సీఐ సతీశ్ జరగండని అనడంతో మంత్రి పక్కనే ఉన్న మాజీ రౌడీషీటర్ నవీన్‌రాజ్ ఎవరు నువ్వు.. ఎందుకు నెడుతున్నావు.. నేనెవరో తెలుసా అంటూ రెచ్చిపోయాడు. దీంతో సదరు ఇన్స్పెక్టర్ నేనెవరో తెలుసా అంటూ.. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పార్టీ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో యూనిఫాంలో ఉన్న పోలీ సు అధికారిపై మాజీ రౌడీషీటర్ తీరును తప్పుపడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనుచరుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి దమ్మున్న పోలీసు అనిపించుకున్నాడని ఆ సీఐకి వారు మద్దతు పలికారు.