సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ప్రభు త్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. కాజీపేట పట్టణం 48వ డివిజన్లోని అఫ్జల్ నగర్, రామాలయం స్ట్రీట్, శాస్త్రీనగర్, గాంధీనగర్, బియాబాని నగర్, ఇంది రా నగర్, పవన్ నగర్లో గురువారం ప్రచారం నిర్వహించారు.
- అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి
- ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా : చీఫ్ విప్ దాస్యం
- 48వ డివిజన్లో ఇంటింటా ప్రచారం
కాజీపేట, నవంబర్ 16 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ప్రభు త్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. కాజీపేట పట్టణం 48వ డివిజన్లోని అఫ్జల్ నగర్, రామాలయం స్ట్రీట్, శాస్త్రీనగర్, గాంధీనగర్, బియాబాని నగర్, ఇంది రా నగర్, పవన్ నగర్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్గా కాజీపేటలో ఇంటింటి ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే యాభై వేల భారీ మెజార్టీతో గెలుపొందుతాననే విశ్వాసం కలుగుతుందన్నారు. నాయకులు, కార్యకర్తలు 13 రోజు లు గెలుపు కోసం కష్టపడితే ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తాన్తన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు అర్హులైన లబ్ధిదారులకు అందుతాయన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికల అనంతరం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే మరోసారి కేసీఆర్‌ను సీఎం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. కార్యక్రమంలో 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సురేశ్, హరినాథ్, రాజు, శ్రీనాథ్, అంబాల రమేశ్, అయూబ్ ఖాన్, ప్రేమ్‌నాథ్, వెంకటేశ్, టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్జోజు శ్రీకాంత్‌చారి, సయ్యద్ సర్వర్, సోని, మహమూద్, రసూల్, కాజా, వసంతతో పాటు కళాకారులు పాల్గొన్నారు.
గులాబీ జెండా.. గుండెల నిండా..
హనుమకొండ : మాజీ మంత్రి, స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాసర్ ఆనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి తన పదవికి రాజీనామా చేస్తే, ఆయన స్ఫూర్తితో అతడి సోదరుడు, మలి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్కు అండగా ఉంటామని 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాసర్ ఆధ్వర్యంలో 1500 మంది యువత బీఆర్ఎస్లో చేరారు. వీరికి దాస్యం గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు అభినవ్ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ హయగ్రీవాచారి మైదానం నుంచి బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువకుల పాత్ర అనిర్వచనీయమైందన్నారు. వారి త్యాగాల ఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ కంటే ముందు మన బతుకులు ఎట్లుండె… ఇయ్యాల మన బతుకులు ఎట్లున్నాయో ఆలోచించాలన్నారు. పార్టీలో చేరుతున్న అందరికీ తాను, పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఐటీ, ఎడ్యుకేషనల్, కల్చరల్ హబ్‌గా మారిందని, రూ.5వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో 100 గురుకులాలు ఉంటే, ఇప్పుడు వెయ్యికి పైగా ఉన్నాయని, 8 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. హనుమకొండలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకులకు ఉద్యో గావకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇప్పటికే ఆరు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేశామని భవిష్యత్తులో మరిన్ని రాబోతున్నాయన్నారు. అనంతరం అభినవ్ భాసర్ మాట్లాడుతూ.. మన అభిమాన నాయకుడు వినయ్‌భాస్కర్‌కు మద్దతుగా నిలవాలన్నారు. ఈ రోజు మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి కుటుంబానికి రాబోయే ఐదేండ్ల కాలంలో మీకు కష్టమొచ్చినా తోడుగా ఉంటామన్నారు. అశేష గులాబీ కుటుంబమే అందరి ధైర్యం అని అన్నా రు. కొందరు హనుమకొండను ఆగం చేద్దామని వస్తుండ్రు వారికి మన సత్తా, దమ్ము చూపిద్దామన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, రైతుబంధు సమితి సభ్యులు సుంచు కృష్ణ, నాయకులు కరుణాకర్, కపిలవాయి రాంబాబు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

