కరీమాబాద్ ఏప్రిల్ 7 : వరంగల్ జిల్లా ఏకశిలా నగర్లోని ఏకశిలా పరపతి సంఘం సభ్యులకు కమిటీ సభ్యులు సోమవారం సంఘం కార్యాలయంలో 20వేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అందరి సహకారంతో సంఘం దినదినాభివృద్ధి చెందిందన్నారు. కొందరు కావాలనే కమిటీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
2000 మంది వరకు ఉన్న సభ్యులకు తలా 20వేల రూపాయలు నగదును అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతినెల 300 మంది చొప్పున నగదు అందజేస్తామన్నారు. కొందరు పరపతి సంఘాన్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. రాజకీయ అండదండలతో సంఘంలో పదవులను చేపట్టాలని చూడటం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.