మహబూబాబాద్ : వరంగల్ జిల్లా సంఘం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడ్డ కారు ప్రమాదంలో ఒకరు మరణించగా ఇద్దరు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేషరాశి పల్లి గ్రామానికి చెందిన ఒకే భార్య, భర్త, ఇద్దరు పిల్లలు కారులో వరంగల్ వైపు వెళ్తున్నారు. వరంగల్ జిల్లా సంఘం మండలం తీగరాజు పల్లి బ్రిడ్జీపైన కారు అదుపుతప్పి కెనాల్ లో పడింది. ఈ ప్రమాదంలో సుమారు రెండేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం.
బాలుని తల్లిని స్థానికులు కాపాడగా తండ్రీ, కూతురు గల్లంతయినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతయిన వారి ఆచూకి కోసం చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.