Buffalo | కమలాపూర్ మండలంలోని అంబాల గ్రామ శివారులో కరెంట్ షాక్తో ముర్రా జాతి గేదె మృతి చెందినట్లు శనివారం గ్రామస్తులు తెలిపారు. అంబాల గ్రామానికి చెందిన గోల్కొండ సమ్మక్క తన గేదెను మేపేందుకు నేరెళ్ల రోడ్డు మార్గంలో తోలుకపోగా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా రాత్రి కురిసిన వర్షానికి కరెంటు తీగలు తెగిపడడంతో కరెంటు షాక్ తగిలినట్లు గ్రామస్తులు చెప్పారు. గేదె సుమారు లక్ష రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. నష్టపోయిన పేద రైతుకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.