ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాడుతాం
ప్రతిపక్షంలో ఉన్నా తాము నిత్యం ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు.
- మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్
- నగరంలో పలు పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు
వరంగల్, మే 18 : ప్రతిపక్షంలో ఉన్నా తాము నిత్యం ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రామన్నపేటలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి మహిళలు, యువకులు బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వినయభాస్కర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నా రు. ప్రజల ఓట్లతో గెలిచి వారి నమ్మకాన్ని వమ్ము చేసిన వారికి బుద్ధి చెబుతారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల అభీష్టం మేరకు పనిచేసే వారికే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని అన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో డివిజన్లో రూ.27 కోట్లతో 344 అభివృద్ది పనులు చేశామని, 1200 మందికి పెన్షన్లు మంజూరు చేశామని, 500 మందికి కల్యాణలక్ష్మి చెక్కలను అందచేశామని వినయభాస్కర్ వివరించారు. ఎన్నికల్లో ఓడినా నేటికీ ప్రజల మధ్య ఉండి పోరాడుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమ నేత కేసీఆర్, బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్, నాయకులు షఫీ, రమేశ్, చందు, రాజు, నాగమణి, లక్ష్మి, రహీం, శ్రీను, రూపేష్, బుస్సా శేఖర్, శివకుమార్, సాయి ప్రశాంత్, ప్రసాద్, రోహిత్, అభిలాష్, శ్యాం కుమార్, విజయ, అనిత, రంజిత, రాధమ్మ, రేణుక, పావని, జ్యోతి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

